AIASL Recruitment: ఐటీఐ అర్హతతో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

|

Mar 28, 2023 | 8:42 PM

ఎయిర్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎఎస్ఎల్)లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

AIASL Recruitment: ఐటీఐ అర్హతతో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Air India Jobs
Follow us on

ఎయిర్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎఎస్ఎల్)లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డ్యూటీ ఆఫీసర్‌ (01), జూనియర్‌ ఆఫీసర్‌ ప్యాసింజర్‌ (04), జూనియర్‌ ఆఫీసర్‌ టెక్నికల్‌ (02), కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ (16), యుటిలిటీ ఏజెంట్ అండ్ ర్యాంప్ డ్రైవర్ (06), హ్యాండీ మ్యాన్ (98) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2, ఐటీఐ, డిప్లొమా(సంబంధిత సబ్జెక్టు), ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..