సాధారణంగా మన దేశంలో ఎక్కడ ఏ వస్తువునైనా ఎంఆర్పీ ధరకే కొనుగోలు చేస్తాం. షాపుల యజమానులు కూడా ఎంఆర్పీ కన్నా తక్కువగా విక్రయించాలి గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ విక్రయించడానికి లేదు. అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎంఆర్పీపై అవగాహన ఉండదు. చాలా మంది దుకాణదారులు ఎంఆర్పీ ధరపై ఎక్కువకే విక్రయాలు చేసేస్తుంటారు. అయితే అది చట్ట రీత్యా నేరం. అలా ఎవరైన దుకాణదారులు చేస్తే వినియోగదారులుగా మనం ప్రశ్నించవచ్చు. లేదా కేసు వేయవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఎంఆర్పీ అంటే ఏమిటి? దానిని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎటువంటి చర్యలుంటాయి? ఎవరిమీదనైనా ఫిర్యాదుచేయాలంటే ఎలా చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఎవరైనా దుకాణదారుడు గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్పీ) కంటే ఎక్కువ వసూలు చేస్తే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. లీగల్ మెట్రాలజీ చట్టం 2009 ప్రకారం ఒక ఉత్పత్తిపై ముద్రించిన ఎంఆర్పీ అనేది వినియోగదారుడు దానిని కొనుగోలు చేయడానికి చెల్లించాల్సిన గరిష్ట ధర. దీనిలోనే అన్ని పన్నులు వచ్చేస్తాయి. ఉత్పత్తి ఖర్చు, రవాణా ఖర్చు, తయారీదారు లాభం, విక్రేత లాభం అన్ని కలుపుకొని ఎంఆర్పీని నిర్ణయిస్తారు.
వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా ఉండేందుకు ఈ ఎంఆర్పీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ప్రతి వస్తువు ప్యాక్ పైనా ముద్రిస్తారు. అతిక్రమించిన విక్రేతలపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి