PAN-Aadhaar Link: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి మరో అవకాశం.. గడువు తేదీని పొడిగించిన కేంద్రం.. ఎప్పటివరకంటే..

|

Mar 28, 2023 | 3:39 PM

మీ పాన్ కార్డ్‌ని మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేశారా..? ప్రతి భారతీయ పౌరుడు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. ఇప్పుడు పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ లింక్ చేసే తేదీని ప్రభుత్వం పొడిగించింది. దేశంలో ముఖ్యమైన పత్రాల్లో ఒకటైన ఆధార్‌. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో నిబంధనలు..

PAN-Aadhaar Link: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి మరో అవకాశం.. గడువు తేదీని పొడిగించిన కేంద్రం.. ఎప్పటివరకంటే..
Follow us on

పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు 30 జూన్ 2023 నాటికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. 30 జూన్ 2023 నాటికి ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు.ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి తేదీ 31 మార్చి 2023.. అయితే ఇప్పుడు దానిని జూన్ 30కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని గతంలో చాలాసార్లు పొడిగించారు.

ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తు్న్నారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతా స్థంభించిపోతుంది. దీంతో లావాదేవీలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాదు పాన్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ముందుగా ఆధార్‌తో లింక్‌ చేసి ఉండాలి.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంపై ఆదాయపు పన్ను శాఖ చాలాసార్లు అడిగారు. మీ పాన్- ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ త్వరలో వస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. IT చట్టం, 1961 ప్రకారం, మినహాయించబడిన కేటగిరీలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. లేకపోతే అన్‌లింక్ చేయబడిన పాన్ పని చేయకుండా పోతుంది.

ఆధార్-పాన్‌ లింక్‌ చేయడం ఎలా..?

  • ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.
  • ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.
  • ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం