Kisan Vikas Patra 2023: కొత్త సంవత్సరంలో కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా..?

|

Dec 30, 2022 | 12:15 PM

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వడ్డీ రేటు 2023: కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ) ఖాతా డిపాజిట్లపై ప్రస్తుత వడ్డీ రేటు వార్షికంగా 7% ఉంటుంది. అయితే డిసెంబరు 31 నాటికి ఈ రేటులో సవరణలు జరిగే అవకాశం ఉంది..

Kisan Vikas Patra 2023: కొత్త సంవత్సరంలో కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా..?
Kisan Vikas Patra
Follow us on

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వడ్డీ రేటు 2023: కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ) ఖాతా డిపాజిట్లపై ప్రస్తుత వడ్డీ రేటు వార్షికంగా 7% ఉంటుంది. అయితే డిసెంబరు 31 నాటికి ఈ రేటులో సవరణలు జరిగే అవకాశం ఉంది. 2023 నూతన సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంపుల మధ్య కిసాన్‌ వికాస్‌ పత్ర డిపాజిటర్లు వడ్డీ రేటులో సవరణలు చేసే అవకాశం ఉంది. అనేక బ్యాంకులు కూడా ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై కేవీపీ కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. గతంలో కేవీపీ డిపాజిటర్లు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన కిసాన్ వికాస్ పత్ర (KVP) వడ్డీ రేటును సవరిస్తుంది. వడ్డీ రేటు డిసెంబర్‌ చివరి నాటికి మార్పులు చేసే అవకాశం ఉంది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) వర్తించే కేవీపీ వడ్డీ రేటు డిసెంబర్ 31, 2022 నాటికి తెలిసిపోతుంది.

ఈ కిసాన్ వికాస్‌ పత్ర స్కీమ్‌లో మీరు కనీసం రూ. 1000తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి అంటూ లేదు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం 10 సంవత్సరాల 4 నెలలలో మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తం రెండింతలు పొందుతారు.

10 సంవత్సరాల 4 నెలల తర్వాత డబ్బు రెట్టింపు

ఉదాహరణకు మీరు ఈ రోజు కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీ రూ. 5 లక్షలలో ఈ మొత్తం 10 సంవత్సరాల 4 నెలల తర్వాత మెచ్యూర్‌ అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన రూ. 5 లక్షల కంటే రెట్టింపు మొత్తం రూ.10 లక్షల వరకు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

అవసరమైతే రెండున్నరేళ్ల తర్వాత విత్‌డ్రా

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే మీరు మీ డబ్బును రెండున్నరేళ్ల తర్వాత కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. దానిపై మీకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్రలో మీ పెట్టుబడికి మంచి భద్రత ఉంటుంది.

ఖాతాలో వివిధ రకాల సౌకర్యాలు:

కాగా, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ రైతుల కోసం ప్రారంభిచింది కేంద్రం. కానీ ఇప్పుడు దేశంలోని ప్రతి పౌరుడు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో అనేక రకాల ఖాతాలు తెరవబడతాయి. ఇందులో మీరు మీ వ్యక్తిగత ఖాతాను కూడా తెరవవచ్చు. అంతే కాకుండా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనితో పాటు, మీరు ఈ పథకంలో ఏదైనా ప్రత్యేక వ్యక్తిని కూడా నామినీగా చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు సమీప పోస్టాఫీసును కూడా సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..