Bajaj New Bikes: బజాజ్ నుంచి కొత్త సంవత్సరంలో శుభవార్త రానుందా! ఆ నాలుగు బైక్‌లను విడుదల చేస్తుందా!

| Edited By: Anil kumar poka

Dec 30, 2022 | 3:02 PM

2022లో ఈ బండిని అప్‌గ్రేడ్‌ చేసిన బజాజ్‌ కంపెనీ పల్సర్ P150 పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతోనే ఆ కంపెనీ 2022ను ముగించింది. అయితే వచ్చే కొత్త సంవత్సరంలో మరో నాలుగు కొత్త మోడల్‌ బైక్‌లను ఆవిష్కరించనున్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Bajaj New Bikes: బజాజ్ నుంచి కొత్త సంవత్సరంలో శుభవార్త రానుందా! ఆ నాలుగు బైక్‌లను విడుదల చేస్తుందా!
Bajaj Pulsar N 160
Follow us on

మన దేశంలో బజాజ్‌ అనగానే గుర్తొచ్చేది పల్సర్‌ బండి మాత్రమే. దేశీయంగా ఎన్ని రకాల మోడళ్లను బజాజ్‌ కంపెనీ ప్రవేశపెట్టినా.. ఈ బండికి సాటి రాదు. యువతలో దీనికున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీనికి పోటీగా ఇతర కంపెనీలకు చెందిన ఎన్ని బైక్‌ లు వచ్చినా పల్సర్‌ ముందు నిలబడలేకపోయాయి. అందుకే బజాజ్‌ కంపెనీలో అత్యధికంగా అమ్ముడు పోయిన బండిగా పల్సర్‌ రికార్డ్‌ సృష్టించింది. 2022లో ఈ బండిని అప్‌గ్రేడ్‌ చేసిన బజాజ్‌ కంపెనీ పల్సర్ P150 పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతోనే ఆ కంపెనీ 2022ను ముగించింది. అయితే వచ్చే కొత్త సంవత్సరంలో మరో నాలుగు కొత్త మోడల్‌ బైక్‌లను ఆవిష్కరించనున్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బజాజ్‌ ఇండియా 2023లో ప్రవేశపెట్టనున్న కొత్త బైక్‌ ల గురించి తెలుసుకుందాం.

ట్రయంఫ్-బజాజ్ స్క్రాంబ్లర్

ట్రయంఫ్‌ కంపెనీ భాగస్వామ్యంతో బజాజ్‌ తీసుకొస్తున్న బైక్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో ఎప్పుడైనా దీనిని లాంచ్‌ అవకాశం ఉంది. ఇది రోడ్‌స్టర్‌ వేరియంట్‌లో 350-400cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రానుంది. ఈ బైక్ ధర దాదాపు రూ.2.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

బజాజ్ అవెంజర్ 250

బజాజ్ అవెంజర్ బండికి కూడా చాలా ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బండ్లలో ఇది కూడా ఒకటి. పల్సర్‌ 250సీలో వాడిన క్వార్టర్-లీటర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ పవర్‌ట్రెయిన్‌ని అవెంజర్ 250 కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా క్రూయిజర్ శ్రేణిలో మంచి ప్రజాదరణ పొందుతున్న యెజ్డీ రోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్, మెటియోర్ 350లపై పోటీగా దీనిని బజాజ్‌ దించే అవకాశం ఉంది. దీని ధర బజాజ్ అవెంజర్ 220 ధరతో సమానంగా ఉండవచ్చని అంచానా వేస్తున్నారు. ధర ప్రస్తుతం రూ. 1,38,368 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.

ఇవి కూడా చదవండి

బజాజ్ పల్సర్ N200

బజాజ్ నుంచి రావచ్చని అంచనా వేస్తున్న మూడో మోటార్ సైకిల్ పల్సర్ N200. 200cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఇది రానుంది. దీని ధర సుమారు రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బజాజ్ పల్సర్ P125

కొత్త పల్సర్‌ P125 బైక్‌ 125cc ఇంజిన్‌తో రానుంది. ఇది P150 కన్నా కన్నా తక్కువ శ్రేణి కి చెందినంది. ఈ బైక్ ధర . 90,000 (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..