Airtel Postpaid: రూ. 799కే ఎయిర్‪టెల్ బంపర్ ఆఫర్.. రెండు సిమ్‪లు, మూడు కనెక్షన్లు.. వివరాలు ఇవి..

|

Mar 26, 2023 | 3:00 PM

ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ రూ. 799 ప్లాన్‌లో రెండు సిమ్‌కార్డులు తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా ఉండే సిమ్‌కార్డుకు అదనంగా మరో యాడ్ ఆన్ సిమ్ కార్డు తీసుకోవచ్చు. నెలవారీగా 105 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

Airtel Postpaid: రూ. 799కే ఎయిర్‪టెల్ బంపర్ ఆఫర్.. రెండు సిమ్‪లు, మూడు కనెక్షన్లు.. వివరాలు ఇవి..
Airtel Plans
Follow us on

దేశీయ టెలికాం దిగ్గజం  ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లపై ఫోకస్ పెట్టింది. అత్యధిక మంది కస్టమర్లను పోస్ట్ పెయిడ్ వైపు మళ్లించేలా సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. అందులో భాగంగా ఎయిర్ టెల్ బ్లాక్ అంటూ సరికొత్తగా ఆఫర్ ను ప్రకటించింది. అందుబాటు ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 799 మాత్రమే. అయితే దీనిలో రెండు పోస్ట్ పెయిడ్ సిమ్ లు, ఒక టీటీహెచ్ కనెక్షన్ పొందే వీలుంటుంది. అంతేకాక ఇంటర్ నెట్, ఓటీటీ, అన్ లిమిటెడ్ 5జీ డేటా వంటి అనేక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియోకు పోటీగా..

ఎయిర్ టెల్ సంస్థ జియోకు పోటీగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మంచి మంచి ఆఫర్లను లాంచ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. జియో పోస్ట్‌పెయిడ్‌కు సంబంధించి ఫ్యామిలీ ప్లాన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ కూడా వేర్వేరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇటీవల ఆవిష్కరించింది. అందులో భాగంగానే ఈ ఎయిర్‌టెల్ బ్లాక్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా అందులో భాగంగానే తెచ్చింది.

ప్లాన్ వివరాలు ఇవి..

ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ రూ. 799 ప్లాన్‌లో రెండు సిమ్‌కార్డులు తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా ఉండే సిమ్‌కార్డుకు అదనంగా మరో యాడ్ ఆన్ సిమ్ కార్డు తీసుకోవచ్చు. నెలవారీగా 105 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా వస్తాయి. ఇక ఈ నెల డేటా మిగిలిపోతే.. అంటే వాడుకోని డేటా తదుపరి నెలకు బదిలీ అవుతుంది. ఇదే ప్లాన్‌లో రూ.260 విలువ చేసే టీవీ ఛానెళ్లు టీడీహెచ్ కనెక్షన్ కింద అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా మరికొన్ని ఓటీటీ సేవలు కూడా ఈ ప్లాన్‌తో పాటే పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

సర్వీస్ అల్టిమేట్..

ఈ బ్లాక్ ప్లాన్‌లో భాగంగా పోస్ట్ పెయిడ్ యూజర్లకు వన్ బిల్- వన్ కాల్ సెంటర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఫిర్యాదులను పరిష్కరించేందుకు కూడా ప్రత్యేక బృందం ఉంటుంది. 60 సెకన్లలోనే కస్టమర్ కేర్ ప్రతినిధులు అందుబాటులోకి వస్తారని టెలికాం దిగ్గజం చెబుతోంది. ఫ్రీ సర్వీస్ విజిట్స్, ఎయిర్‌టెల్ షాప్‌లో బై నౌ.. పే లేటర్ సదుపాయం కూడా ఉంది. ఇక 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉంటే ఇదే ప్లాన్‌మీద అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ సహా డీటీహెచ్ వాడేవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..