Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం రేటు ఎంత పెరిగిందో తెలుసా..?

|

Aug 23, 2023 | 6:35 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఏవైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి చూపు బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం రేటు ఎంత పెరిగిందో తెలుసా..?
Gold Silver Prices
Follow us on

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఏవైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి చూపు బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పసిడి స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.54,200 గా ఉంటే.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,130 గా ఉంది. తాజాగా.. పది గ్రాముల బంగారంపై రూ.60 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.15,00 ల మేర పెరిగి 74,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,220 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130 గా ఉంది. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,600, 24 క్యారెట్ల ధర రూ.59,560, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్ల ధర రూ.59,130 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130 గా ఉంటే.. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,200 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,130 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130, విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,200, 24 క్యారెట్లు రూ.59,130గా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,800 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,800, చెన్నైలో వెండి కిలో ధర రూ.78,000, కేరళలో రూ.78,800 లుగా ఉంది. బెంగళూరులో వెండి ధర రూ.73,750, కోల్‌కతాలో రూ.74,800 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా.. విజయవాడలో రూ.78,000, విశాఖపట్నంలో రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..