ఇటీవల బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అయితే తాజాగా బంగారం ధరలో తగ్గింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గడం విశేషం. గురువారం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధర తగ్గింది. దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 వద్ద నమోదైంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.57,870 వద్ద ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,920 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 ఉంది.
ఓవైపు బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది. గురువారం చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500, ముంబైలో రూ.69,000, ఢిల్లీలో రూ.69,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000, బెంగళూరులో రూ.72,500, హైదరాబాద్‌లో రూ.72,500, విశాఖ, విజయవాడలో రూ.72,500 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి