జీవిత బీమా అంటే అనుకోని పరిస్థితుల్లో మనం మరణించిన సందర్భంలో మన కుటుంబానికి భరోసా ఇస్తుంది. పర్సనల్ ఇన్సూరెన్స్‌తో పాటు పెరుగుతున్న వాహనాల సంఖ్య అనుగుణంగా ప్రమాద బీమా చేయించుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా వాహనదారులు నిబంధనల ప్రకారం కచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించాలి. ఎందుకంటే వాహనదారుడి వల్ల ఎవరికైనా నష్టం జరిగితే మోటర్ వెహికల్స్ చట్టం ప్రకారం వాహనదారుడిదే బాధ్యత. కాబట్టి కచ్చితంగా వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లిస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచలేదు. అయితే తర్వాత 2022లో దాదాపు 15-20 శాతం వరకూ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు పెరిగాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను సవరిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది సవరణ ఎలా ఉంటుందో అని వాహనదారులు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ ఏడాది ఇన్సూరెన్స్ ప్రీమియం ధరల్లో ఎలాంటి సవరణలు లేవని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెంపు లేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐఆర్‌డీఏఐ ప్రకారం థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కోసం కొత్త యాక్చురియల్ లెక్కలను పొందుతుంది. అందువల్ల, కొత్త రేట్లు అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భీమా పరిశ్రమ మోటారు భీమా రేట్ల ఎగువ విభజన కోసం రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐకి ప్రతిపాదనలు పంపింది. రెగ్యులేటర్ కొత్త థర్డ్ పార్టీ బీమా రేట్లను చేరుకోవడానికి వాస్తవిక లెక్కలను ప్రారంభించింది. అందువల్ల, బహుశా జూన్ వరకు అంటే వచ్చే మూడు నెలల వరకు, థర్డ్ పార్టీ బీమా సవరించబడదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రేట్లు జూలై నుండి అమలులోకి వస్తాయి.
కరోనా కారణంగా 2020, 2021లో రేట్లు సవరించలేదు. అయితే, 2022లో రివిజన్ సమయంలో, థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ 15-25 శాతం పెరిగింది. ముఖ్యంగా తమ బీమాను పునరుద్ధరించుకోవాల్సిన కస్టమర్‌లకు, ఐదేళ్ల థర్డ్ పార్టీ కోసం తప్పనిసరిగా చెల్లించాల్సిన కొత్త యజమానులకు పెద్ద ఉపశమనాన్ని కలుగజేస్తూ ఏ ఏడాది ప్రీమియాన్ని ఆ ఏడాదే చెల్లించేలా నిబంధనలను సడలించారు. గతంలో ఫోర్ వీలర్స్ వాహనదారులు కచ్చితంగా మూడేళ్ల పాటు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చెల్లించేవారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి