Aadhaar-PAN Linking: ఆధార్‌ – పాన్‌ అనుసంధానం గడువు పొడిగించనుందా..? పెనాల్టీ ఉంటుందా..?

|

Mar 28, 2023 | 9:50 AM

ప్రస్తుత ఆర్థిక సంబంధిత విషయాల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. అయితే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. అన్ని పత్రాలు కూడా ఈ ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు త్వరలో గొప్ప వార్తలను వినవచ్చు..

Aadhaar-PAN Linking: ఆధార్‌ - పాన్‌ అనుసంధానం గడువు పొడిగించనుందా..? పెనాల్టీ ఉంటుందా..?
Aadhaar Pan Linking
Follow us on

ప్రస్తుత ఆర్థిక సంబంధిత విషయాల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. అయితే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. అన్ని పత్రాలు కూడా ఈ ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు త్వరలో గొప్ప వార్తలను వినవచ్చు. ఆధార్-పాన్‌ కార్డును అనుసంధానం చేసుకునేందుకు ఇప్పటికే కేంద్రం చాలా సార్లు పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు రూ.1000 పెనాల్టీతో మార్చి 31, 2023 వరకు గడువు ఉంది. గడువు ముగిసినట్లయితే మీ పాన్‌ కార్డు రద్దు చేయనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

అయితే మార్చి 31, 2022కి ముందు పాన్‌ను లింక్‌ చేసుకునేందుకు ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు లేకుండా అవకాశం ఇచ్చింది. కానీ ఆ తర్వాత అనుసంధానం చేయాలంటే జరిమానా చెల్లించక తప్పదు. చాలా మంది పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినందుకు 1000 రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం పాన్-ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. అయితే రూ. 1000 జరిమానా విధింపును అమలులో ఉంచింది.

అటువంటి పరిస్థితిలో, పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి ప్రభుత్వం గడువును మరికొన్ని నెలలు పొడిగించవచ్చని, ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత గడువు మార్చి 31, 2023తో ముగియడానికి ముందే పన్ను చెల్లింపుదారులకు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి మరింత సమయం ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి

1000 జరిమానాతో..

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. మే 2017 నోటిఫికేషన్ ప్రకారం పన్ను మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ హోల్డర్లందరూ తప్పనిసరిగా తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. లేని పక్షంలో మీ పాన్ రద్దు అవుతుంది. http://www.incometax.gov.inలో రూ. 1000 రుసుము చెల్లించిన తర్వాత చెల్లుబాటు అయ్యే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను శాఖ గత నెలలో ఒక ట్వీట్‌లో పేర్కొంది.

ప్రభుత్వం పెనాల్టీని 9 నెలలు పెంచింది

ఆధార్-పాన్ లింకింగ్ గడువు చాలా సార్లు పొడిగించారు. మార్చి 31, 2022కి ముందు లింకింగ్ ప్రాసెస్ పూర్తిగా ఉచితం. ఏప్రిల్ 1, 2022 నుంచి రూ. 500 రుసుము విధించబడింది. తరువాత జూలై 1, 2022 నుంచి రూ. 1,000కి పెంచింది. ఆధార్-పాన్ లింకింగ్ గడువును పొడిగించడం ద్వారా ఇదే పెనాల్టీతో ఈసారి ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలుగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి