Woman Harassment: కృష్ణా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నిండు గర్భిణిని చిత్రహింసలకు గురి చేసిన అత్తింటి వారు.. ఇప్పుడు ఆమెను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అదేమంటే దిక్కున్న చోట చెప్పుకోపో అని హూంకరిస్తున్నారు. దాంతో బాధిత మహిళ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన చంటిబాబు, సౌజన్యకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసి వధువు అలా మెట్టింట్లో అడుగు పెట్టిందో లేదో.. వేధింపులు మొదలయ్యాయి. చంటిబాబు తన భార్యపై అనుమానంతో పెళ్లి చేసుకున్న 10 రోజులకే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాడు. అప్పటి నుంచి సౌజన్యను అనుమానంతో నిత్యం వేధిస్తుండేవాడు. అతనికి అత్త, మామ లు కూడా తోడవడంతో సౌజన్య పరిస్థితి మరింత నరకప్రాయంగా మారింది.
ఈ నేపథ్యంలో రోజూ వారు పెట్టే టార్చర్ భరించలేక సౌజన్య కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ప్రస్తుతం సౌజన్య ఏడు నెలల గర్బిణి. అయితే, పుట్టింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి తిరిగి రావొద్దంటూ చంటిబాబు తేల్చి చెప్పాడు. భర్తను విడిచి ఉండలేనన్న సౌజన్య.. ఇవాళ తన బంధువులతో కలిసి అత్తింటికి వచ్చింది. వారిని ఒప్పించి ఇంట్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు బోరున విలపించింది. ఈ అంశంపై పోలీసులను ఆశ్రయించిన సౌజన్య.. తన భర్త, అత్తమామ లకు కౌన్సిలింగ్ ఇచ్చి తనను తన భర్త వద్దకు చేర్చాలంటూ వేడుకుంది. తాను ఇప్పుడు గర్భవతిని అని, తన భర్త తనకు కావాలని కన్నీరుమున్నీరు అయ్యింది. సౌజన్య అభ్యర్థన మేరకు స్పందించిన మైలవరం పోలీసులు.. ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, పోలీసులు చెప్పినప్పటికీ చంటిబాబు కుటుంబ సభ్యులు మాత్రం సౌజన్యను ఇంట్లోకి రానిచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.
Also read: Parliament: ఈ రోజూ అదే తీరు.. ఆందోళనలతో అట్టుడికిన పార్లమెంట్.. ఉభయ సభలు మార్చి 15 వరకు వాయిదా
మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం