Agency Bandh: వైసీపీ సర్కారు తీర్మానంపై సర్వత్రా నిరసనలు.. మన్యంలో కొనసాగుతోన్న బంద్

|

Mar 31, 2023 | 11:28 AM

ఏపీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గిరిజనులు రొడ్డెక్కారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగిస్తున్నారు. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గిరిజనులు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో..

Agency Bandh: వైసీపీ సర్కారు తీర్మానంపై సర్వత్రా నిరసనలు.. మన్యంలో కొనసాగుతోన్న బంద్
Agency Bandh
Follow us on

ఏపీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గిరిజనులు రొడ్డెక్కారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగిస్తున్నారు. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గిరిజనులు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీల పిలుపునిచ్చాయి. శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకిస్తూ పాడేరు, అరకు, చింతపల్లి సబ్ డివిజన్లలో బంద్ కొనసాగుతోంది. అరకు లోయలో పర్యాటక కేంద్రాలను మూసివేశారు. వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బంద్‌ కొనసాగుతోంది. ప్రధాన రహదారిపై బైఠాయించి గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొదటి నుంచి వైసీపీకి వెన్నంటి నిలిచిన గిరిజనులకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు గిరిజన నాయకులు. గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు.

మావోయిస్టుల మద్దతు..

పాడేరు,అరకు,చింతపల్లి సబ్ డివిజన్లలో బంద్ ప్రారంభమైంది. అరకులోయలో పర్యాటక కేంద్రాలను మూసివేశారు. వర్తక వ్యాపారులు బంద్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. అరకు,పాడేరు వారపు సంతలు రద్దయ్యాయి. ఆదివాసీల బంద్‌కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఆదివాసీల నిరసనలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. విద్యాసంస్థలు యధావిధిగా తెరచి ఉంటారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..