Chittoor: కౌండిన్య అభయారణ్యంలో కరి కష్టాలు.. ఉనికికే ఇబ్బందులు.. ఎందుకు దాడి చేస్తున్నాయో తెలియక రైతుల్లో ఆందోళన..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 22, 2023 | 7:10 AM

Chittoor District: అడవిలోని జంతువులు ఇప్పుడు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అడవిని వదిలి వస్తున్నాయా..లేక ఆకలితో ఆహారం కోసం వస్తున్నాయో, దాహంతో పంట పొలాల పై దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ ఇప్పుడు గజరాజుల కదలికలు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో భయాందోళనకు కారణం అవుతున్నాయి. రైతులను పొట్టను పెట్టుకుని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒకవైపు తమిళనాడు మరోవైపు కర్ణాటక..

Chittoor: కౌండిన్య అభయారణ్యంలో కరి కష్టాలు.. ఉనికికే ఇబ్బందులు.. ఎందుకు దాడి చేస్తున్నాయో తెలియక రైతుల్లో ఆందోళన..
Representative Image
Follow us on

చిత్తూరు జిల్లా, ఆగస్టు 22: చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఏనుగుల సమస్య పరిష్కారం కాని సమస్యగా మారిపోయింది. ఏనుగులు మనగుడ కోసం పోరాడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రమాదాలకు గురై బలైపోతున్న ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడమే కాదు, రైతులను పొట్టన పెట్టుకుంటుండటంతో గజరాజుల యుద్ధకాండ కొనసాగుతోంది. మూడు రాష్ట్రాల సరిహద్దులు లోని చిత్తూరు జిల్లాలో ఈ సమస్య రైతాంగాన్ని కలవరపెట్టడమే కాదు అటవీ శాఖకు కూడా సవాలుగా మారింది. కౌండిన్య అభయారణ్యంలోని గజరాజుల ఉనికే ప్రశ్నార్థకంగా మారేలా చేసింది. అడవిలోని జంతువులు ఇప్పుడు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అడవిని వదిలి వస్తున్నాయా..లేక ఆకలితో ఆహారం కోసం వస్తున్నాయో, దాహంతో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ ఇప్పుడు గజరాజుల కదలికలు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో భయాందోళనకు కారణం అవుతున్నాయి.

రైతులను పొట్టను పెట్టుకుని ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒకవైపు తమిళనాడు మరోవైపు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులోనే ఉన్న చిత్తూరు జిల్లా రైతాంగానికి ఏనుగుల సమస్య కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కౌండిన్య అభయారణ్యంలో దాదాపు 90 కి పైగా ఏనుగులు ఉన్నట్లు గుర్తించినా వాటి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకమని అటవీ శాఖ కూడా భావిస్తొంది. ఏనుగుల మనుగడకే కాదు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైతుల ప్రాణాలకు పంట పొలాలకు రక్షణ కరువైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 7 గుంపులుగా విడిపోయి పంట పొలాలు, జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు ప్రమాదాలకు కూడా గురి అవుతున్నాయి.

పొలాల్లోని విద్యుత్ తీగలు ట్రాన్స్ఫార్మర్లను తాకి మృత్యువాత పడుతున్నాయి. ఏడాదిగా అటవీ శాఖ లెక్కలను పరిశీలిస్తే 7 ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మృత్యువాత పడగా మరో నాలుగు ఏనుగులు విద్యుత్ ఘాతంతో మృతి చెందాయి. రెండ్రోజుల క్రితం పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లి లో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు మార్కండేయ అనే రైతును బలి తీసుకుంది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మార్కండేయ, అరుణలపై దాడి చేసిన ఏనుగు బీభత్సం సృష్టించింది. మరోవైపు బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్ల పల్లి వద్ద పొలంలో విద్యుత్ తీగలు తగిలి ఆడ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఇలా ప్రమాదాలకు గురై 7 ఏనుగులు చెందగా నలుగురు రైతులు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి.

ఇవి కూడా చదవండి

హైవే రోడ్లు, ఊళ్ళు చుట్టేస్తూ హల్ చల్ చేస్తున్న ఏనుగులు ప్రమాదాలకు గురికావడం అటవీ శాఖలో ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. మరోవైపు రైతుల ప్రాణాలు పంట పొలాలు కు నష్టం వాటిల్లుతుండడంతో రైతాంగం కూడా దిగాలుగా ఉంది. అయితే రెండు వైపులా జరుగుతున్న నష్టం పై ప్రభుత్వం గజరాజులు అభయారణ్యం నుంచి బయటికి రాకుండా చర్యలు చేపడుతోంది. కంచెలు, కందకాలు, సోలార్ ఫినిషింగ్ లు వేస్తున్న అటవీ శాఖ ఏనుగులు ఆకర్షించే పంటలను అటవీ ప్రాంతం సమీపంలో ఉండే రైతులు సాగుచేయవద్దని సూచిస్తుంది.

రైతులపై పగ పట్టినట్లుగా దాడులు.

రైతులపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్న ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాలోనే తిష్ట వేయడంతో అటువైపు చూడాలంటేనే భయపడుతున్న పరిస్థితి రైతాంగంలో ఉంది. విద్యుత్, అటవీ శాఖల అధికారుల సమన్వయ లోపంతో పొలాల్లో నేలకు తాకుతున్న విద్యుత్ తీగలు, పొలంలోని ట్రాన్స్ఫార్మర్లు ఏనుగుల ప్రాణాలను బలి తీసుకుంటుడటంపై జంతు ప్రేమికుల నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తరచూ ఏనుగులు విద్యుత్ ఘాతానికి గురికావడం, మృత్యువాత పడుతుండడానికి కారణం అటవీ, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏనుగుల మరణాలకు ఆ శాఖ అధికారులే బాధ్యులను చేసి కేసులు నమోదు చేయాలంటున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత రైతాంగాన్ని ఏడాది పొడవునా ఏనుగుల భయం రైతులు పొలాలవైపు వెళ్ళనీయకుండా చేస్తోంది. ఏనుగుల దాడుల వల్ల పంట పొలాలు నాశనం అవుతుండటంతో గగ్గోలు పెడుతున్న రైతాంగం ప్రభుత్వ పరిహారం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏనుగుల బీభత్సంతో పంటలను కోల్పోతున్న రైతులు విద్యుత్ షాక్ కు గురై ఏనుగులు మరణిస్తే తామే కారణమంటూ అటవీ శాఖ కేసుల పేరుతో భయపెట్టడాన్ని రైతులు తప్పుపడుతున్నారు.