Andhra Pradesh: సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్నికల షెడ్యూల్ వివరాలివే..

| Edited By: Vimal Kumar

Nov 03, 2023 | 2:23 PM

Andhra Pradesh: వివిధ కారణాలతో గ్రామ పంచాయతీల్లో ఖాళీ అయిన సర్పంచ్‌లు, వార్డు మెంబెర్లను ప్రత్యక్ష ఎన్నికలు ద్వారా ఎన్నుకొనున్నారు. ఈ మేరకు మొత్తం 1033 గ్రామ పంచాయతీల్లో 66 మంది సర్పంచ్‌లు,1063 మంది వార్డు మెంబర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా పదవుల భర్తీకి ఎన్నికల షెడ్యూల్‌ను గెజిట్ నెంబర్ 26 ద్వారా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవులకు ఆగస్టు 8వ తేదీన రిటర్నింగ్..

Andhra Pradesh: సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్నికల షెడ్యూల్ వివరాలివే..
Panchayat Elections For Vacant Posts
Follow us on

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికకు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సహనీ విడుదల చేసారు. వివిధ కారణాలతో గ్రామ పంచాయతీల్లో ఖాళీ అయిన సర్పంచ్‌లు, వార్డు మెంబెర్లను ప్రత్యక్ష ఎన్నికలు ద్వారా ఎన్నుకొనున్నారు. ఈ మేరకు మొత్తం 1033 గ్రామ పంచాయతీల్లో 66 మంది సర్పంచ్‌లు,1063 మంది వార్డు మెంబర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా పదవుల భర్తీకి ఎన్నికల షెడ్యూల్‌ను గెజిట్ నెంబర్ 26 ద్వారా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.

ఎన్నికల షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవులకు ఆగస్టు 8వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇంకా ఆగస్టు 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు ఉప సంహరించుకోవడానికి అవకాశం ఉంది. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఆగస్టు 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఎక్కడైనా, ఏదైనా సమస్య వచ్చి రిపోలింగ్ అవసరమైతే దాన్ని ఆగస్టు 20వ తేదీన నిర్వహిస్తారు.