భూకంపం జపాన్‌ను తాకింది: జపాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఉత్తర జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం మరో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని సమాచారం.
జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, భూకంపం సాయంత్రం 6:18 గంటలకు (0918 GMT) 20 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో సంభవించింది.
కాగా, జపాన్ భూభాగం అత్యంత భారీ భూకంపాలు వచ్చే ప్రదేశంలో ఉంది. అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం ఆగ్నేయ యాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం..ఆ ప్రాంతంలో సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఉన్నందువల్లే జపాన్ అత్యంత కఠినమైన నిర్మాణాలు కలిగి ఉంది.
2011లో జపాన్ సమీపంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దాని దాటికి సునామీ అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసేసాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసి పడిన రాకాసి అలల కారణంగా 20 వేలకు పైగా ప్రజలు మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..