సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు !! తవ్వి చూసి షాక్‌ తిన్న కుటుంబం

| Edited By: Vimal Kumar

Nov 05, 2024 | 12:54 PM

బ్రెజిల్‌లోని ఓ కుటుంబం తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడాను సజీవంగా సమాధి చేసినట్లు సంచలనం సృష్టించారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచిందని శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నిందని తెలిపారు. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదట. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది.

బ్రెజిల్‌లోని ఓ కుటుంబం తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడాను సజీవంగా సమాధి చేసినట్లు సంచలనం సృష్టించారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉందని బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచిందని శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నిందని తెలిపారు. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదట. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియా వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడిందని అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో ఉలిక్కిపడ్డామని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో

 

Published on: Aug 25, 2023 09:24 AM