Banana: వామ్మో.. ఇంత పెద్ద అరటిపండా..? ఈ అరటిపండు తినాలంటే..
మీరు వెయిట్ పెరగాలా అయితే రోజూ అరటిపండు తినండి.. మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలా టేక్ బనానా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న అరటి పండు అంటే అందరూ ఇష్టంగా తింటారు.
మీరు వెయిట్ పెరగాలా అయితే రోజూ అరటిపండు తినండి.. మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలా టేక్ బనానా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న అరటి పండు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ప్రస్తుతం ఈ అరటిపండు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అవును.. సాధారణంగా కాస్త పెద్ద అరటిపండును చూడగానే మనం ముచ్చటపడిపోతాం. కానీ ఈ అరటిపండును చూస్తేమాత్రం ఆశ్చర్యంతో ఇంత పెద్ద అరటిపండా..! అని నోరెళ్లబెడతాం. ఎందుకంటే ఈ ఒక్క అరటిపండు బరువు ఎంతుంటుందో తెలుసా… మూడు కిలోలు.. దీనిని ఒక్కరు కాదుకదా ఇద్దరు ముగ్గురు కూడా తినలేరు.. ఇవి ఆస్ట్రేలియన్ ద్వీపం పాపువా న్యూగినియాలో పండుతాయి. ఈ చెట్టు అరటిపండు ఒక మూర పొడవుంటుంది. ఈ భారీ అరటిపండు గిన్నిస్ రికార్డులో సైతం చోటు దక్కించుకుంది. న్యూ పాపువా గినియాకు చెందిన ఈ అరటి మొక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద అరటి మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ చెట్టు కాండం 15 మీటర్ల ఎత్తు ఉంటుంది, దీని ఆకులు కూడా భూమినుంచి 20 మీటర్ల ఎత్తులో ఉంటాయట. ఈ చెట్టు అరటిగెలవేసి, అది పక్వానికి రావడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుందట. ఈ అతిపెద్ద అరటిపండుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఈ భారీ అరటిపండును తినడానికి ఓ యువతి, మరో యువకుడు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ అరటిపండును చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంత పెద్ద అరిటిపండా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..