జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి

| Edited By: Vimal Kumar

Sep 05, 2023 | 3:55 PM

అడవిలో జంతువులను నేరుగా చూడాలని చాలామంది అనుకుంటారు. అడవిలో వాతావరణం, వన్యమృగాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే చాలామంది సఫారీలకు వెళ్తుంటారు. అడవిలో గైడ్‌ ఆధ్వర్యంలో వాహనంలో తిరుగుతూ జంతువులను దగ్గరగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు. అలా సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులను అనేక సందర్భాల్లో అసహనానికి గురైన జంతువులు పరుగులు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ జిరాఫీ టూరిస్టులకు చుక్కలు చూపించింది.

అడవిలో జంతువులను నేరుగా చూడాలని చాలామంది అనుకుంటారు. అడవిలో వాతావరణం, వన్యమృగాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే చాలామంది సఫారీలకు వెళ్తుంటారు. అడవిలో గైడ్‌ ఆధ్వర్యంలో వాహనంలో తిరుగుతూ జంతువులను దగ్గరగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు. అలా సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులను అనేక సందర్భాల్లో అసహనానికి గురైన జంతువులు పరుగులు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ జిరాఫీ టూరిస్టులకు చుక్కలు చూపించింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ జిరాఫీ ఓ జీప్‌ను వెంబడిస్తోంది. అది చాలా వేగంగా పరుగులు పెడుతూ జీప్‌ను ఛేజ్ చేస్తోంది. దాంతో టూరిస్టులు భయంతో అరుపులు, కేకలు వేశారు. వాహనంలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం జిరాఫీ తమ వాహనాన్ని ఛేజ్‌ చేయడాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట పరుగులు పెడుతోంది. సాధారణంగా జిరాఫీలు శాంతియుతంగా ఉంటాయి. అయితే మనుషులకు అంత త్వరగా దగ్గరకావు. ఎవరైనా వాటి జోలికి వెళ్తే మాత్రం వదిలిపెట్టవు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 5 లక్షలమంది వీక్షించారు. జిరాఫీ కోపాన్నిచూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో

Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!

ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్

Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!

 

Published on: Aug 25, 2023 09:19 AM