Elephant attack: ఏనుగుకి కోపం వస్తే.. గిట్లుంటది! షాకింగ్ వీడియో.. పాపం అవి మాత్రం ఎం చేస్తాయ్..
మన దేశంలో ఏనుగులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కేరళ, అసోం ముందుంటాయి. అంతరించిపోతున్న అరణ్యాల కారణంగా.. తరచూ ఏనుగులు జనావాసాల వైపు వస్తూ ఉంటాయి.
తాజాగా అసోం గోల్పారా ప్రాంతంలోని రాంగ్‌జులి గ్రామంలోకి ఏనుగుల గుంపు దారితప్పి వచ్చాయి. సాధారణంగా ఇలా వచ్చే గజరాజులు ఎవరి జోలికీ పోవు. గుంపుగా నడుస్తూ మళ్లీ అడవిలోకి వెళ్లిపోతాయి. ఈసారి మాత్రం అవి ఆహారం కోసం పంటపొలాలలోకి వెళ్లి నాశనం చేశాయి. అది చూసిన స్థానికులు.. ఎలాగైనా వాటిని తరిమేయాలనుకున్నారు. ప్రజలు అరుస్తుండటంతో.. ఏనుగులు తిరిగి అడవి దారిపట్టాయి. అయితే, అదే సమయంలో ఒక ఏనుగు మాత్రం గుంపు నుంచి దూరంగా వెళ్లింది. దాన్ని కూడా పంపాలనే ఉద్దేశంతో వెంటపడ్డారు. అంతే.. ఆ గజానికి ఆగ్రహం కలిగింది. వెళ్లిపోయేది కాస్తా వెనక్కి తిరిగి.. ప్రజల వెంట పడింది. దాంతో.. స్థానికులు తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. గట్టిగా అరుస్తూ ఆ ఏనుగు వారిని హడలెత్తించింది. ఆ తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..