ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

| Edited By: Vimal Kumar

Nov 03, 2023 | 4:15 PM

ప్రేమకు మనసు ముఖ్యం కానీ వయసుతో సంబంధం ఏముంది అంటూ ఉత్సాహంగా కబుర్లు చెప్పి మెల్లగా ముగ్గులోకి దించాడు. ఇంకేముంది ఆ మాటలకు పొంగిపోయిన 63 ఏళ్ల వృద్ధురాలు నువ్వే నా సర్వస్వం అంటూ అతనితోకలిసి చెట్టాపట్టాలేసుకొని చక్కర్లు కొట్టింది. పెళ్లి మాట ఎత్తేసరికి ఆమెను చంపేస్తానని బెదిరించాడు 70 ఏళ్ల ఆ వృద్ధ ప్రియుడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ 63 ఏళ్ల వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

ప్రేమకు మనసు ముఖ్యం కానీ వయసుతో సంబంధం ఏముంది అంటూ ఉత్సాహంగా కబుర్లు చెప్పి మెల్లగా ముగ్గులోకి దించాడు. ఇంకేముంది ఆ మాటలకు పొంగిపోయిన 63 ఏళ్ల వృద్ధురాలు నువ్వే నా సర్వస్వం అంటూ అతనితోకలిసి చెట్టాపట్టాలేసుకొని చక్కర్లు కొట్టింది. పెళ్లి మాట ఎత్తేసరికి ఆమెను చంపేస్తానని బెదిరించాడు 70 ఏళ్ల ఆ వృద్ధ ప్రియుడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ 63 ఏళ్ల వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలు గట్టిగా నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. వృద్ధుడి భార్య కూడా మరణించింది. ఐదేళ్ల క్రితం వృద్దుడి కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరి సమక్షంలోనే వృద్ధుడి కుమారుడి పెళ్లి జరిగింది. ఇద్దరు కలిసి విహారయాత్రలు చేశారు. అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని వృద్ధుడిని డిమాండ్​ చేసింది బాధితురాలు. మొదట్లో అందుకు ఒప్పుకున్న వృద్ధుడు.. అనంతరం నిరాకరించాడు. గట్టిగా నిలదీయగా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెంగళూరులోని తూర్పు డివిజన్​ మహిళా పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్

Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!

Sukumar: అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్

కోట్ల మందికి ఆనందాన్ని పంచిన కలయిక.. నెట్టింట వైరల్

Published on: Aug 25, 2023 09:11 AM