RBI New Guidelines: ఆర్బీఐ కొత్త నిబంధనలు..ఇకపై కార్డు వివరాలు..! వీడియో

|

Aug 24, 2021 | 9:56 AM

బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అప్పుడప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల విషయాల్లో కూడా నిబంధనలు మార్పులు చేస్తుంటుంది.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అప్పుడప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల విషయాల్లో కూడా నిబంధనలు మార్పులు చేస్తుంటుంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసాలను నివారించేందుకు ఆర్బీఐ పలు నిబంధనలు మారుస్తూ ఉంటుంది. సాధారణంగా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల నుంచి లావాదేవీలు జరిపేటప్పుడు సీవీవీ నెంబర్‌ గుర్తించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం కార్డు వివరాలు నమోదు చేసుకుని ఉంటాము కాబట్టి. సీవీవీ నెంబర్‌తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది. కానీ ఆర్బీఐ నిబంధనలు మార్పుల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుపై ఉండే 16 అంకెల నంబర్లను గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేవలం నంబర్లే కాదు గడువు తేదీ, సీవీవీ వంటివీ కూడా గుర్తు పెట్టుకోవాలి. డేటా స్టోరేజీకి సంబంధించి ఆర్‌బీఐ త్వరలోనే నిబంధనలను మార్పు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రూ.7లక్షలకే మూడు కిలోల బంగారం.. ఇంటికెళ్లి చూస్తే.. వీడియో

Chiranjeevi Fans: మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ.. ఒకేసారి నాలుగు సినిమాలకు మెగా రెడీ.. లైవ్ వీడియో

Follow us on