వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను జతచేసే అపూర్వ బంధం..అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయంటారు. బంధువులు, స్నేహితుల మధ్య అట్టహాసంగా జరుపుకునే అద్భుతమైన రోజు పెళ్లి.. మన దేశంలో వివాహాలు ఆయా ప్రాంతాల బట్టి వారి వారి ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకుంటారు. కులం, వర్గం, మతం, దేశాన్ని బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి. ప్రతి సాంప్రదాయ ఆచారం ఈవెంట్‌లో సరదాలకు కొదువే ఉండదు. పెళ్లివేడుకల్లో అనుకోని విషయాలు వివాహ వేడుకను మరింత ఉల్లాసంగా మారుస్తాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాంప్రదాయ ఆచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు వధువును కొంత మంది బంధువులు ఆటపట్టిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
వీడియోలో చూసినట్లుగా వరుడు, వధువు ఇద్దరూ కళ్యాణ మండపంలో కూర్చున్నారు. అయితే, వరుడు, వధువు ఇద్దరి బంధువులు ‘టగ్ ఆఫ్ వార్’ ఆట మాదిరిగానే ఎర్రటి దుప్పటను లాగడం కనిపిస్తుంది. రెండు టీమ్‌ల మధ్య ఆట..పీక్స్ వెళ్లిందనే చెప్పాలి.వారిలో ఒక టీమ్ దుప్పట లాగటంలో గెలిచింది.. దాంతో ఎదుటి వారిని లాగుతున్న క్రమంలో ఇరువైపుల బంధువులు పోటాపోటీగా దుప్పట లాగుతూ ఒకరిపై ఒకరు పడిపోయారు. వారిలో ఒక వ్యక్తి మొదట పెళ్లి కూతురిపై పడగా, అతనిపై మరో వ్యక్తి పడతాడు.. అయినప్పటికీ వారు దుప్పటి విడిచిపెట్టకుండా లాగుతూనే ఉన్నారు. దాంతో వధువును కూడా కొంతదూరం ఈడ్చుకెళ్లారు. పెళ్లిలో ఇదేం వైపరీత్యంరా బాబు అనుకునే కనిపించింది ఈ విచిత్ర ఆచారం. మొత్తానికి వీడియో మాత్రం..నెటిజన్లను ఉత్సహపరిచింది..
వైరల్‌గా మారిన వీడియోకి నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. నెప్టిక్‌టాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో 5 లక్షలకు పైగా లైకులు సంపాదించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..