Viral: కారు నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. పోలీసుల విచారణలో తేలింది ఇదే…

|

Mar 15, 2023 | 1:46 PM

యూట్యూబర్ జోరవర్ సింగ్ కల్సి, అతని స్నేహితుడు లక్కీ కాంబోజ్‌లను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వారు కరెన్సీ నోట్లను రన్నింగ్ కారు నుంచి రోడ్డుపై విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral: కారు నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. పోలీసుల విచారణలో తేలింది ఇదే...
Throwing Currency From Car
Follow us on

ఇటీవల హర్యానాలోని గురుగ్రామ్‌లో కదులుతున్న ఖరీదైన కారులో నుంచి కరెన్సీ నోట్లను రోడ్డుపై వెదజల్లిన వీడియో వైరల్‌ అయ్యింది. కారులో నుంచి డబ్బులు విసిరిన ఇద్దరు వ్యక్తులను గురుగ్రామ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు ప్రముఖ యూట్యూబర్ జోరావర్ సింగ్ కల్సి, గురుప్రీత్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై ప్రమాదకరమైన డ్రైవింగ్, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు.

డబ్బులు రోడ్డుపై విసిరి… షాహిద్ కపూర్,  కెకె మీనన్ నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’లోని సన్నివేశాన్ని తిరిగి రూపొందించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో ఈ యువకులు వెల్లడించారు. సోషల్ మీడియాలో లైక్‌లు పొందడానికి వారు ఇలా చేశారు. ఈ వీడియోను వారు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు.. కానీ వివాదం చెలరేగడంతో తర్వాత తొలగించారు. వారు విసిరిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవి అని పోలీసులు నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..