ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్యాసింజర్ రైళ్లలో విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఆర్సీ పురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-ఆర్సీ పురం, ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మరోవైపు.. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే.. తాజాగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలు దేరిన 08505 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. జనవరి 11, 13, 16 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
జనవరి 12, 14, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.40 కు బయలుదేరనున్న 08506 నంబర్ గల ప్రత్యేక రైలు.. తర్వాతి రోజు ఉదయం 8.20కి విశాఖ చేరుకుంటుంది. ఈ మేరకు రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..