Vande Bharat Express: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేవారికి అలెర్ట్.. ఆలస్యంగా బయలుదేరనున్న వందే భారత్ ట్రైన్

|

Apr 06, 2023 | 3:55 PM

రాళ్ల దాడిలో పగిలిన కోచ్ అద్దం విలువ దాదాపు రూ. లక్ష రూపాయల వరకు ఉంటుందని... ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని.. ఆగంతుకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Vande Bharat Express: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేవారికి అలెర్ట్.. ఆలస్యంగా బయలుదేరనున్న వందే భారత్ ట్రైన్
వీటితో పాటు రూ 720 కోట్ల నిధులతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రయాణికుల రాకపోకల పరంగా అతిపెద్ద స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు స్టేషన్ భవనాన్ని భారీ ఎత్తున మార్పులు చేయనున్నారు.
Follow us on

వందే భారత్ ట్రైన్‌(20834)లో ఈ రోజు(గురువారం) సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లాలనుకున్న ప్రయాణీకులు అలెర్ట్. మాములుగా సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ట్రైన్ బయలు దేరుతుంది. కానీ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దాని పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నందున ఈ ట్రైన్ కూడా లేటుగా బయలు దేరుతుందని అధికారులు తెలిపారు.

బుధవారం సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్ వెళ్తున్న దారిలో..  ఖమ్మం-విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్‌పై రాళ్ల దాడి చేశారు అగంతకులు. దీంతో.. C8 కోచ్ అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. కోచ్‌ మరమ్మత్తుల కోసమే ఇవాళ వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్ ఆలస్యంగా బయలుదేరింది. విశాఖ నుంచి ఉదయం 5:45 కు సికింద్రాబాద్‌కు బయలు దేరాల్సిన ట్రైన్ 9:45కు స్టార్టయ్యింది.

ట్రైన్లపై రాళ్ల దాడికి పాల్పడే వారిని గుర్తించి.. రైల్వే యాక్ట్‌లోని కఠిన సెక్షన్లు పెట్టాలని అధికారులు డిసైడయ్యారు. తాజాగా ట్రైన్‌పై దాడి చేసిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) తీవ్రంగా గాలిస్తోంది. పగిలిన కోచ్ అద్దం విలువ దాదాపు రూ. లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా శనివారం కొత్తగా సికింద్రాబాద్‌-తిరుపతి రూట్‌లో వందేభారత్‌ ట్రైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..