Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని మీమర్స్‌కి, ట్రోలర్స్‌కి పోలీసుల వార్నింగ్.. పలువురు అరెస్ట్

|

Mar 29, 2023 | 4:28 PM

ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్‌ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ క్రైమ్ వింగ్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే మహిళలను కించిపరిస్తే ఎట్టి పరిస్థిల్లోనూ సహించేది లేదన్నారు.

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని మీమర్స్‌కి, ట్రోలర్స్‌కి పోలీసుల వార్నింగ్.. పలువురు అరెస్ట్
DCP Sneha Mehra
Follow us on

ఏదైనా పరిధి దాటనంతవరకు అయితే ఓకే. కానీ అతి చేస్తే మాత్రం పర్యావసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టాలు చేసే లీడర్లపై, అలానే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. అసభ్యకరమైన పోస్టులు చేసినా, మీమ్స్, ట్రోల్స్ చేసినా.. ఫొటో మార్ఫింగ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు క్రైమ్‌ డీసీపీ స్నేహ మెహ్రా. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్‌ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేసి, 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు డీసీపీ స్నేహ మెహ్రా. మరో 30 మంది ట్రోలర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇటీవలి కాలంలో కొన్ని యూ ట్యూబ్‌ ఛానళ్లు గీత దాటి వ్యవహరిస్తున్నాయని డీసీపీ క్రైమ్‌ స్నేహ మెహ్రా. తెలుగురాష్ట్రాల్లోని యూ ట్యూబ్‌ ఛానళ్లైనా ట్రోలర్‌ కుర్రాడు, మిస్టర్‌ మసబై ఛానల్‌, వెంకమ్మ ట్రోల్‌, తెలుగు ట్రోల్స్‌, చందు ట్రోల్స్‌, చింటూ ట్రోల్స్‌, బంటిబాబు ట్రోల్స్‌ వంటి తెలుగు యూట్యూబ్‌ ఛానళ్లలో రాజకీయనాయకులు, సెలబ్రిటీలపై అసభ్యకరమైన రీతిలో పదాలు వాడి ట్రోల్‌ చేశారు. దీనిపై క్రైమ్‌ టీమ్ నిఘాపెట్టి, ఆధారాలు సేకరించింది. ఛానల్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు క్రైమ్‌ డీసీపీ స్నేహ మెహ్రా. రేటింగ్‌, డబ్బు కోసం అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిరంతంర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం