150 అవార్డులు తెచ్చుకున్నాం.. మీరా.. మాకు చెప్పేది..?

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2019 | 2:39 PM

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ టెండర్ల అమౌంట్ తగ్గించి.. ఎంతో ఆదా చేశామన్నారు. లోకేష్, చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలనుకునే జగన్ ప్రయత్నం విఫలయత్నం అవుతుందన్నారు. వైఎస్‌ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొనుగోలు చేస్తే.. టీడీపీ ప్రభుత్వం రూ.2.70 పైసలకు కొనుగోలు చేశారు. మీ నాయన గారి నిర్వాకంతో డిస్కంలకు 8 వేల కోట్ల రూపాయల నష్టం […]

150 అవార్డులు తెచ్చుకున్నాం.. మీరా.. మాకు చెప్పేది..?
Follow us on

ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ టెండర్ల అమౌంట్ తగ్గించి.. ఎంతో ఆదా చేశామన్నారు. లోకేష్, చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలనుకునే జగన్ ప్రయత్నం విఫలయత్నం అవుతుందన్నారు.

వైఎస్‌ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొనుగోలు చేస్తే.. టీడీపీ ప్రభుత్వం రూ.2.70 పైసలకు కొనుగోలు చేశారు. మీ నాయన గారి నిర్వాకంతో డిస్కంలకు 8 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ ఉదాహరణలు చాలవా..? ఎవరు మహానేతో.. తెలుసుకోవడానికి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ సాధించి ఐదేళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్విట్టర్‌లో వివరించారు.

అన్నయ్యలూ.. నాకేం తెలియదంటూనే ఎలాంటి విచారణ చేయకుండా.. కనీస ఆధారాలు లేకుండా 2,363 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. ‘గుడ్డ కాల్చి మీద వేయడంలో మీకు మీరే సాటి జగన్’ అని ఎద్దేవా చేశారు లోకేష్.