Nokia phones: నోకియా నుంచి రెండు కొత్త ఫోన్స్‌ వచ్చేశాయ్‌.. తక్కువ బడ్జెట్‌లో ఏమన్న ఫీచర్సా అసలు

|

Aug 17, 2023 | 7:55 PM

మొబైల్ తయారీ కంపెనీ నోకియాకు ఎలాంటి క్రేజ్‌ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నమ్మకానికి మారుపేరుగా ఉండేది నోకియా. అయితే స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నోకియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌లను లాంచ్‌ చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా నోకియా కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఈ క్రమంలోనే కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా నోకియా నుంచి రెండు కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
నోకియా జీ310 5జీ, నోకియా సీ210 పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అందుబాటులోకి  వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్స్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ల ధర విషయానికొస్తే మన కరెన్సీలో చెప్పాలంటే నోకియా జీ310 ధర రూ. 15,000, నోకియా సీ210 ధర రూ. 9000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

2 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే నోకియా జీ310 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720 x 1,612 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. స్నాప్‌డ్రాగ్‌ 480+ 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

3 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 20 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఇక నోకియా సీ210 స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే ఇందులో 6.3 ఇంచెస్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 720x1,560 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌సీడీ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 662 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 3000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.