Infinix 12 Gen Inbook X3: మరో కొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేసిన ఇన్‌ఫినిక్స్‌.. రూ.28 వేలకే సూపర్‌ స్లిమ్‌ ల్యాప్‌టాప్‌ మీ సొంతం

|

Aug 24, 2023 | 10:30 AM

ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌లా తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోం కల్చర్‌ బాగా పెరిగింది. కాబట్టి ల్యాప్‌టాప్‌ వినియోగం కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు కొత్త కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో రిలీజ్‌చేస్తున్నాయి. ఇదే బాటలో ప్రముఖ కంపెనీ అయిన ఇన్‌ఫినిక్స్‌ తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను రిలీజ్‌ చేస్తుంది. తాజాగా ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ సూపర్‌స్లిమ్‌ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ల్యాప్‌ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ 14.8 ఎంఎం అతి సన్ననైన ల్యాప్‌టాప్‌గా కంపెనీ పేర్కొంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ అతి తక్కువ ధరలో అధునాత ఫీచర్లను అందిస్తుందని ఇన్‌ఫినిక్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

2 / 5
ఇన్‌ఫినిక్స్‌ నయా ల్యాప్‌టాప్‌ బరువు 1.24 కిలోలు. ఇది తక్కువ కాంతిలో పని చేసేందుకు వీలుగా బ్లాక్‌ లీట్‌ కీబోర్డుతో వస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ తేలికపాటి మెటల్‌తో రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్‌ రెడ్‌, గ్రీన్‌, సిల్వర్‌, బ్లూ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

3 / 5
ఈ ల్యాప్‌టాప్‌లో అధిక నాణ్యత వీడియో కాలింగ్‌ కోసం డ్యూయల్‌ స్టార్‌ లైట్‌ ఫ్లాష్‌ 1080 పీ వెబ్‌క్యామ్‌ ద్వారా పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 65 వాట్స్‌ ఈజీ క్యారీ టైప్‌-సీ చార్జర్‌ ద్వారా 50 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ల్యాప్‌టాప​ గరిష్టంగా తొమ్మిది గంటల వీడియో ప్లే బ్యాక్‌ సమయాన్ని, అలాగే తొమ్మిది గంట వరకూ సాధారణ పనిని అనుమతిస్తుంది.

4 / 5
ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ 4.4 జీహెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీతో 12వ జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. ఈ ల్యాప్‌ 1 టీబీ + 16 ర్యామ్‌తో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీ కోసం డ్యుయల్‌ స్టీరియో స్పీకర్‌ + డీటీఎస్‌ ఆడియో సిస్టమ్‌తో పని చేస్తుంది.

5 / 5
ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ మూడు వేరింయంట్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఐ3, ఐ5, ఐ7 వేరియంట్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.27,990గా ఉంది.