Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. కాగా ఆగస్టు 4 తేదీన శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు టాప్ లీడర్స్ హాజరవ్వనున్నారు.