Rajitha Chanti |
Mar 26, 2023 | 4:34 PM
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో సంయుక్త ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంది సంయుక్త. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన బింబిసార చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది.
ఇక ఇటీవల ధనుష్ నటించిన సార్ చిత్రంలో మరో సూపర్ హిట్ అందుకుంది సంయుక్త. దీంతో ఈ అమ్మడుకు తెలుగు మరిన్ని అవకాశాలు క్యూకట్టడమే కాదు.. లక్కీ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న విరూపాక్ష చిత్రంలో నటిస్తోంది సంయుక్త. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
అయితే గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో నెట్టుకోస్తున్నారు సాయి ధరమ్ తేజ్. గతంలో విడుదలైన రిపబ్లిక్ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఇప్పుడు ఈ హీరో ఆశలన్నీ విరూపాక్ష పైనే ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు వరుస హిట్స్ అందుకుంటూ లక్కీ గర్ల్ గా పేరు సంపాదించుకున్న సంయుక్త.. మరీ ఈసారి మెగా హీరోకు విజయాన్ని అందిస్తోందో లేదో చూడాలి.
అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త.. ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి.