GST: ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై జీఎస్టీ బిల్లు.. లోక్‌సభ ఆమోదం .. భారం ఎంతో తెలుసా..?

|

Aug 11, 2023 | 5:00 PM

ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీని తర్వాత, ఆగస్టు 2న ఆన్‌లైన్ గేమింగ్‌ను తీసుకురావడానికి బిల్లులలో సవరణల ఫార్మాట్‌ను కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ చర్యను ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వ్యతిరేకించింది. దీంతో పరిశ్రమలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఈ నిర్ణయం వల్ల నష్టాల..

1 / 5
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఈ బిల్లును వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో ఉంచారు. సుదీర్ఘ చర్చ తర్వాత పార్లమెంటు ఆమోదం పొందింది. దీంతో బిల్లు చట్టంగా మారింది.

2 / 5
అంటే ఇప్పుడు ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినో వ్యాపారంతో అనుబంధించబడిన వ్యాపారవేత్తలు 28 శాతం గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) చెల్లించాలి. ఇది ప్రభుత్వ ఆదాయానికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో జీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలలో సవరణను ఆమోదించిన తర్వాత జీఎస్టీ చట్టంలో ఇటువంటి సవరణలకు రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఆమోదం పొందవలసి ఉంటుంది.

3 / 5
జూలై 11న ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. దీని తర్వాత, ఆగస్టు 2న ఆన్‌లైన్ గేమింగ్‌ను తీసుకురావడానికి బిల్లులలో సవరణల ఫార్మాట్‌ను కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ చర్యను ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వ్యతిరేకించింది.

4 / 5
దీంతో పరిశ్రమలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఈ నిర్ణయం వల్ల నష్టాల గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి.

5 / 5
ఆగస్టు 2న జీఎస్టీ కౌన్సిల్‌ 51వ సమావేశం జరిగిందది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినో, గుర్రపు పందాలపై పన్ను రేటుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడింది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం పన్ను విధింపు నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది 6 నెలల తర్వాత సమీక్షించబడుతుంది.