ఆయన బ్యాట్ తో కొట్టాడా ? రిపోర్ట్ పంపండి…

| Edited By:

Jun 28, 2019 | 3:32 PM

మధ్యప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఒక మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన ఉదంతంపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై తనకు నివేదిక పంపాలని హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించారు. ఇండోర్-3 నియోజకవర్గం నుంచి మొదటిసారి కమలం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకాష్ విజయ్ వర్గీయ.. ఓ క్రికెట్ బ్యాట్ తో మున్సిపల్ అధికారినొకరిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ సీనియర్ నేత […]

ఆయన బ్యాట్ తో కొట్టాడా ? రిపోర్ట్ పంపండి...
Follow us on

మధ్యప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే ఒక మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన ఉదంతంపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై తనకు నివేదిక పంపాలని హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించారు. ఇండోర్-3 నియోజకవర్గం నుంచి మొదటిసారి కమలం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకాష్ విజయ్ వర్గీయ.. ఓ క్రికెట్ బ్యాట్ తో మున్సిపల్ అధికారినొకరిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ సీనియర్ నేత కొడుకయిన ఆకాష్.. దౌర్జన్యం పార్టీని తీవ్రమైన ఇరకాటాన పెట్టిందని, ఇందుకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటున్నామని మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇండోర్ లో ఆక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టిన అధికారిని ఆకాష్ బ్యాట్ తో కొట్టడమే కాక, ఆయన సహచరులు ఆ అధికారిని దుర్భాషలాడుతూ, తరిమిన వైనం పబ్లిక్ చూసి నోరెళ్ళబెట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఆకాష్ ను అరెస్టు చేశారు. ఆయన బెయిల్ కోసం యత్నించగా కోర్టు తిరస్కరించడంతో వచ్ఛే నెల 7 వరకు జైలుకు పంపారు. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి బాల బచన్ ఈ ఘటనపై స్పందిస్తూ. కమలనాథుల నిర్వాకం ఏమిటో తెలుస్తోందన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులనే వారు అదుపులో పెట్టుకోలేకపోతున్నారని అన్నారు.
అయితే పశ్చిమ బెంగాల్ లో హౌరా వద్ద బీజేపీ కార్యకర్తలు నడిరోడ్డుపై హనుమాన్ చాలీసా పఠిస్తూ వాహనదారులను ఇబ్బందుల పాల్జేయడం బహుశా పార్టీ నాయకత్వానికి తెలిసినట్టు లేదు. ముస్లిములు… ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోడ్డుపైనే నమాజ్ చేస్తూ పబ్లిక్ కి అవస్థలు కల్పిస్తున్నారని, ఇందుకు నిరసనగా తాము హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నామని బీజేపీ కార్యకర్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు.