టాలీవుడ్ ఆడియన్స్ ఫేవరెట్ పెయిర్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం దసరా. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సౌత్ టూ నార్త్ ప్రధాన నగరాల్లో దసరా ప్రమోషన్స్ చేస్తున్నారు నాని. దసరా చిత్రయూనిట్, కీర్తి సురేష్ తోపాటు.. నాని సినిమా ప్రమోషన్లలో దగ్గుబాటి రానా కూడా పాల్గొంటున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కీర్తి సురేష్ చేసిన పనికి అంతా షాకయ్యారు.
ప్రస్తుతం దసరా ప్రమోషన్స్ ముంబైలో జరుగుతున్నాయి. దసరా సినిమాలో తాను మందేసి పలు సీన్స్ చేసినట్లుగా నాని తెలిపారు. ఈ సినిమాలో నాని బాటిల్ ఎత్తితే దించకుండా తాగేస్తాడట. ఇక సినిమా ప్రమోషన్లలోనూ మరోసారి నాని ఇలాగే కల్లు తాగగా..రానా కూడా నాని స్టైల్లో కల్లు తాగేశాడు. ఇక వీరిద్దరిని చూసి కీర్తి సురేష్ కూడా ఎత్తిన సీన దించకుండా కల్లు తాగేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కీర్తి సురేష్ అలా గట గటా కల్లు తాగడం చూసి నాని, రానా షాకయ్యారు. ఇక అక్కడున్న అభిమానులంతా తమ అరుపులతో కీరతి సురేష్ మరింత ప్రోత్సాహించారు. సింగరేణి బొగ్గు గనుల నేపధ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నాని పక్కా ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.
Cheers guys ??@KeerthyOfficial #KeerthySuresh ? #Dasara pic.twitter.com/n5Syknzs9k
— ꜱᴜꜱɪ ? ᴋᴇᴇʀᴛʜy (@susikeerthy1) March 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.