OTT Movies: ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా..

|

Mar 27, 2023 | 12:32 PM

ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు.. ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతున్నాయి. 50 రోజుల థ్రియేట్రికల్ రన్ టైమ్ పూర్తి చేసుకుని ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారు. మరీ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

OTT Movies: ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా..
Ott Movies
Follow us on

ప్రస్తుతం చిన్న సినిమాల హావా కొనసాగుతుంది. అటు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సత్తా చాటుతున్నాయి. ఇటీవల విడుదలైన బలగం సినిమా అందుకు నిదర్శనం. థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకుని.. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇటు ఓటీటీలోనూ మంచి వ్యూస్ అందుకుంటుంది. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు.. ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతున్నాయి. 50 రోజుల థ్రియేట్రికల్ రన్ టైమ్ పూర్తి చేసుకుని ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారు. మరీ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబ్బత్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మార్చి 31న స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ కాపీ క్యాట్ కిల్లర్ ఏప్రిల్ 1న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే హాలీవుడ్ మూవీ వార్ సైలర్, ఫైండింగ్ యు రిలీజ్ కానున్నాయి.

ఇక జీ 5..
జయం రవి హీరోగా నటించిన అగిలన్ (తమిళ్).. మార్చి 31న రిలీజ్.
శివ కుమార్ నటించిన అయోతి (తమిళ్).. మార్టి 31న స్ట్రీమింగ్

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు మూవీ.. మార్చి 30న స్ట్రీమింగ్
డూగీ కమెలో హా .. వెబ్ సిరీస్.. మార్చి 31న స్ట్రీమింగ్.

ఆహా ఓటీటీ..
గోదారి.. డాక్యుమెంటరీ సిరీస్.. మార్చి 31న స్ట్రీమింగ్.
సత్తిగాని రెండు ఎకరాలు.. వెబ్ మూవీ.. ఏప్రిల్ 1న స్ట్రీమింగ్.

సన్ నెక్ట్స్..
ప్రభుదేవా నటించిన భగీరా సినిమా.. మార్చి 31న రిలీజ్.
మొత్తానికి ఈ వారం అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.