నిత్యం వార్తల్లో నిలచే నటీ మణుల్లో సమంత ఒకరు. ప్రస్తుతం సామ్ ట్రెండింగ్‌లో ఉంటోంది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గుడపుతోన్న సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నటి మొన్న తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసిన సామ్.. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన శాకుంతలం చిత్రం కోసం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా డబ్బింగ్ పనులకు సామ్ మొదలు పెట్టింది.
ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సామ్ ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను రాసుకొచ్చింది. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఫొటోను పోస్ట్ చేసిన సమంత..’ఎన్ని బాధలు వచ్చినా, ఎంత నష్టపోయినా, ఈ ప్రపంచం మనల్ని వదిలేసినా తోడుగా ఉండేది కళ ఒక్కటే. కళ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం’ అనే కొటేషన్‌ను రాసుకొచ్చింది సమంత. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సమంత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించినట్లున్న పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుతలం సినిమాను ఫిబ్రవర్ 17వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ శంకుతలగా నటిస్తుండగా, దుష్కంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..