ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన ఈఎస్‌ఐలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న 106 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు పోస్టులు ఉన్నాయి.
* అనాటమీ, ఫిజియాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జన్సీ మెడిసిన్, పాథాలజీ, పెడియాట్రిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 67 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 1,05,356 నుంచి రూ. 2,22,543 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 09-01-2023న ప్రారంభమై 16-01-2023తో ముగియనుంది.
* ఇంటర్వ్యూలను 20-01-2023 నుంచి 31-01-2023 వరకు నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..