ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. వారంతం వచ్చిందంటే చాలు ఇంట్లో వంటను తగ్గించేవారు ఉన్నరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం టిఫిన్ నుంచి నుంచి రాత్రి డిన్న వరకు అన్నింటికీ ఫుడ్ డెలివరి యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు అభివృద్ధి చెందుతోంది. ఇదిలా ఉంటే 2022 ఏడాదికి సంబంధించి జొమాటో పలు ఆసక్తికర విషాలను పంచుకుంది. ఈ ఏడాది అధికంగా తమ యాప్‌లో బిర్యానీలు బుక్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఇక ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జొమాటో యాప్ ద్వారా 2022 ఏడాదిలో ఏకంగా 3330 ఫుడ్ ఆర్డర్స్ చేసిన రికార్డు సృష్టించాడు. 2022లో భారతీయులు ఫుడ్ ఆర్డర్స్‌పై జొమాటో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి 2022లో అత్యధికంగా 3330 ఫుడ్ ఆర్డర్స్ చేయడం విశేషం. ఇతన్ని జొమాటో ‘బెస్ట్ కస్టమర్ ఆఫ్ 2022గా ప్రకటించింది. అతడు ‘నేషన్స్ బిగ్గెస్ట్ ఫూడీ ఆఫ్ 2022 అని కూడా ప్రకటించింది. అంటే ఈ వ్యక్తి రోజుకు సగటును 9కిపైగా ఫుడ్ ఆర్డర్స్ చేశాడమన్నమాట.
ఇదిలా ఉంటే జొమాటో ప్రకటించిన నివేదికలో ముంబైకి చెందిన మరో వ్యక్తి కూడా స్థానం దక్కించుకున్నాడు. జొమాటో యాప్‌లోని ప్రోమో కోడ్స్‌ను ఉపయోగించి ఇతడు 2022లో ఏంగా రూ. 2.43 లక్షలను సేవ్ చేసినట్లు జొమాటో తెలిపింది. అయితే ప్రోమో కోడ్‌లను ఎక్కువగా ఉపయోగించుకున్న పట్టణం మాత్రం పశ్చిమ బెంగాళల్‌లోని రాయిగంజ్. ఇక్కడ ఏకంగా 99.7 శాతం ఆర్డర్స్‌లో ప్రోమో కోడ్‌ను ఉపయోగించారు. జొమాటో 2022 ఆర్డర్స్‌లో బిర్యాని మొదటి స్థానంలో ఉండగా పిజ్జా రెండో స్థానంలో నిలిచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..