కొత్త బైక్ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో బైక్‌ను సొంతం చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే ప్రస్తుతం ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ టబైక్స్‌పై ఓ లుక్కేయండి..
ప్రస్తుతం భారత్ తక్కు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బైక్స్‌లో హీరో హెచ్‌ఎఫ్ 100 ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 54,962గా ఉంది. ఇందులో 97cc ఇంజన్‌ను అందించారు. 8hp పవర్, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
100సీసీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్‌లో హీరో హెచ్‌ఎప్ డీలక్స్ ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,232 నుండి రూ. 68,382 మధ్య ఉంది. ఇందులో 97cc ‘స్లోపర్’ ఇంజన్‌ని అందించారు. i3S స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ ఈ బైక్ సొంతం.
టీవీఎస్ స్పోర్ట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 61,500 నుంచి రూ. 69,873గా ఉంది. ఇందులో 109.7cc ఇంజన్‌ను ఇచ్చారు. ఇది 8.3hp పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
హోండా షైన్ 100 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,900గా ఉంది. ఈ బైక్ 99.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 7.61hp పవర్, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ స్టార్టర్ కూడా ఉంది.
బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,475 ఉంది. ఇందులో DTS-i టెక్నాలజీతో 102cc ఇంజన్‌ను ఇచ్చారు. ఈ బైక్ ఇంజన్ 7.9 హెచ్‌పి పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు ముందు భాగంలో LED DRLలను అందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..