పాన్ కార్డ్‌ని ఆధార్‌తో అనుసంధానించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు గడువును పొడగిస్తూ వచ్చిన ప్రభుత్వం. మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకవేళ మార్చి 31వ తేదీలోపు ఆధార్‌తో పాన్ లింక్ అవ్వకపోతే అవి నిరూపయోగంగా మారుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ. 1000 జిరిమానాతో ఆధార్-పాన్‌ను అనుసంధానిచ్చే అవకాశాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో అసలు రూ. వెయ్యి జరిమానాతో ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఆధార్-పాన్‌ను లింక్ చేయడానికి ముందుగా NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) పోర్టల్‌కి వెళ్లాలి.
* అనంతరం చలాన్ నెంబర్ ITNS 280పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత మేజర్ మేజర్ హెడ్ 0021, మైనర్ హెడ్ 500 సెలక్క్ చేసుకోవాలి.
* అనంతరం నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.
* చివరిగా కింద పాన్ కార్డ్ నెంబర్‌తో పాటు ఏడాదిని ఎంటర్ చేయాలి. అనంతరం కింద ఉన్న ఇతర సమాచారాలను అందించాలి. చివరిగా క్యాప్చాను నమోదు చేసి కంటిన్యూపై నొక్కాలి. ఇలా ఫైన్ చెల్లించిన 4-5 రోజుల తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో కనిపిస్తుంది. అప్పుడు పాన్-ఆధార్ లింకేజ్ చేసుకోవాలి.
* ఇందుకోసం ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
* రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ పాన్ నంబర్ మీ ID అవుతుంది.
* అనంతరం యూజర్ ఐడి, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వొచ్చు.
* వెంటనే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయమని అడుగుతున్న పాప్ అప్ విండో కనిపిస్తుంది. అది కనిపించకపోతే ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి.
* పేజీలో డేటాఫ్ భర్త్‌తో పాటు జెండర్ వివరాలు కనిపిస్తాయి.
* ఈ వివరాలను మీ ఆధార్‌తో సరిపోల్చుకోవాలి. ఒకవేళ వేరువేరుగా ఉంటే తప్పును సరిదిద్దుకోవచ్చు.
* చివరిగా మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, “లింక్ నౌ” బటన్‌పై క్లిక్ చేయండి. మీ పాన్ ఆధార్‌తో లింక్ అయినట్లు పాప్ అప్ సందేశం వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..