Viral News: 62 ఏళ్ల బామ్మ 8వ బిడ్డకు రెడీ.. 25 ఏళ్ల భర్తతో పిల్లను కనాలనుకుంటున్నట్లు వెల్లడి.. నెటిజన్స్ రియాక్షన్ ఇదీ

తాను ఇప్పుడు స్వయంగా బిడ్డను కనలేను.. కనుక తాము సర్రోగేట్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకోసం ఇప్పటికే ముగ్గురు సర్రోగేట్‌లను చూశాము.. మరొకరి కోసం వెతుకుతున్నామని చెప్పింది. అయితే ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెరిల్ చెప్పింది.

Viral News: 62 ఏళ్ల బామ్మ 8వ బిడ్డకు రెడీ.. 25 ఏళ్ల భర్తతో పిల్లను కనాలనుకుంటున్నట్లు వెల్లడి.. నెటిజన్స్ రియాక్షన్ ఇదీ
Cheryl Mcgregor And Quran Mccain
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2023 | 11:49 AM

ప్రేమ ఆస్తులు అంతస్తులు, వయసు, ఉద్యోగాలు వంటి తారతమ్య భేదాలు చూసుకోదు.  తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘంటలు అనేకం ఉన్నాయి, అలాంటి జంటల్లో ఒకరు.. చెరిల్ మెక్‌గ్రెగర్, ఖురాన్ మెక్‌కెయిన్‌ జంట. ఈ జంట మధ్య తేడా ఏకంగా 37 ఏళ్లు.. భార్య కంటే భర్త 37 ఏళ్లు చిన్నవాడు. అయితే ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేస్తున్నారు.. 62 ఏళ్ల చెరిల్ తన 25 ఏళ్ల భాగస్వామి మెక్‌కెయిన్‌తో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఉంది. ఈ బామ్మకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు, 17 మంది మనవళ్లు ఉన్నారు. సెప్టెంబరు 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. “ఈ మార్నింగ్ షో”లో తల్లిదండ్రులు కావాలనే తమ ప్రణాళికల గురించి వెల్లడించారు.

ఈ సంవత్సరం సర్రోగేట్ ద్వారా బిడ్డను కనాలనే తమ ప్రణాళికల గురించి చెప్పారు. “చెరిల్ తన వయస్సు కారణంగా శిశువుకు జన్మనిచ్చి.. జాగ్రత్తగా చూసుకోగలనా అని ఆలోచిస్తున్నట్లు చెప్పింది. అయితే తాను ఇప్పుడు స్వయంగా బిడ్డను కనలేను.. కనుక తాము సర్రోగేట్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకోసం ఇప్పటికే ముగ్గురు సర్రోగేట్‌లను చూశాము.. మరొకరి కోసం వెతుకుతున్నామని చెప్పింది. అయితే ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెరిల్ చెప్పింది. తాను పిల్లలను కని పెంచి పెద్ద చేశానని.. తన శక్తిని ఇప్పటికే ఖర్చు పెట్టినట్లు పేర్కొంది.

అయితే ఇదంతా టిక్‌టాక్‌కు జిమ్మిక్కుగా పేర్కొంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే చెరిల్ మెక్‌గ్రెగర్, ఖురాన్ మెక్‌కెయిన్‌ జంట ఈ వాదనలను తోసిపుచ్చారు. మెక్‌కెయిన్‌ మాట్లాడుతూ.. మా ప్రేమ గురించి చాలా మంది ప్రజలు ఏదేదో ఊహించుకుంటున్నారు. మీకు కావల్సింది.. మీకు ఎలా అనిపిస్తుందో అలా మాట్లాడుతున్నారు. మేము ఆ మాటలను నియంత్రించలేము. మాకు ఏ సంబంధం లేకుండా.. మనం టిక్‌టాక్‌లో ఉన్నా లేకున్నా మమ్మల్ని తమ మాటలతో బాధిస్తున్నారని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ జంటకు టిక్‌టాక్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్.. ఈ జంట తాము పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తమ జీవితం సంతోషకరంగా సాగుతుందని చెప్పారు. మేము మా కుటుంబాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని.. ఒక బిడ్డకు జన్మనివ్వాలని చూస్తున్నామని చెప్పారు. ప్రపంచం అంతా మాకు వ్యతిరేకంగా ఉన్నా సరే..  మేము సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..