Viral News: ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల రోజుకు రెండు బకెట్ల నూడుల్స్ లాగించేస్తుంది..! రెండేళ్ల తర్వాత మరో జీవిగా మారిపోయింది..!!

టిబెటన్ కుక్కపిల్లలు సాధారణంగా నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. అవి పెద్దయ్యాక దాదాపు 69 కిలోల బరువు ఉంటుంది. ఇవి ఆసియాటిక్ బ్లాక్ ఎలుగుబంటిని పోలి ఉంటాయి.

Viral News: ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల రోజుకు రెండు బకెట్ల నూడుల్స్ లాగించేస్తుంది..! రెండేళ్ల తర్వాత మరో జీవిగా మారిపోయింది..!!
Tibetan Mastiff Puppy F
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 04, 2023 | 7:47 PM

కుక్కగా భావించి రెండేళ్లపాటు పెంచి పోషించిన ఓ జీవి చివరకు పెద్దయ్యాక అది ఎలుగుబంటిగా మారింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని సు యాన్ అనే గ్రామంలో జరిగింది ఈ అద్భుతమైన సంఘటన. రెండేళ్లపాటు దానిని పెంచిపెద్ద చేసిన తర్వాత ఆ కుక్క కాస్త అంతరించిపోతున్న ఆసియా ఎలుగుబంటిగా గుర్తించారు. సు యాన్‌ గ్రామానికి చెందిన ఒక కుటుంబం 2016లో విహారయాత్రలో టిబెటన్ కుక్కపిల్లని కొనుగోలు చేసింది. రెండేళ్లుగా పెంచి పెద్దచేశారు. అయితే రెండు సంవత్సరాల తర్వాత ఆ జంతువు పెరిగి పెద్దదైంది. 250 పౌండ్లు అంటే సుమారు 114 కిలోల బరువు పెరిగింది. పైగా రెండు కాళ్లపై నడవడం ప్రారంభించింది.

ఆహారం విషయంలో కూడా అతిగా తింటుందని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. తరువాత, రోజుకు ఒక పండ్ల పెట్టె, రెండు బకెట్ల నూడుల్స్‌ని ఖాలీ చేస్తుండేది. అలా పెరిగిన కుక్కపిల్ల పెద్దయ్యాక అది ఎలుగుబంటిలా కనిపిస్తుంది. కుటుంబానికి అనుమానం పెరిగింది. వెంటనే అటవీ అధికారులను సంప్రదించగా, అది కుక్క కాదు.. ఎలుగుబంటి అని తెలిసింది.

అది ఎలుగుబంటి అని తెలుసుకున్న సు యాన్ అధికారులను సంప్రదించాడు. వన్యప్రాణులను ఇళ్లలో ఉంచడం చట్టవిరుద్ధం. ఈ క్రమంలోనే సు యన్ అధికారులను ఆశ్రయించారు. అధికారులు వచ్చి అది ఎలుగుబంటి అని నిర్ధారించడంతో కుక్కపిల్లను తీసుకెళ్లారు. ఎలుగుబంటి బరువు 182 కిలోల బరువు, మూడు అడుగుల పొడవు ఉంది. ఎలుగుబంటిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలనలో ఉంచారు. హిమాలయన్ బేర్ లేదా మూన్ బేర్ అని కూడా పిలవబడే పూర్తి-ఎదుగుతున్న మగ ఆసియాటిక్ ఎలుగుబంటి 200 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ అద్భుతమైన కథ 2018లో మొదటిసారిగా వచ్చింది. కానీ, ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే అది పెద్దయ్యాక ఎలుగుబంటి పిల్లగా మారిపోయింది. టిబెటన్ కుక్కపిల్లలు సాధారణంగా నలుపు, గోధుమ రంగులో ఉంటాయి. అవి పెద్దయ్యాక దాదాపు 69 కిలోల బరువు ఉంటుంది. ఇవి ఆసియాటిక్ బ్లాక్ ఎలుగుబంటిని పోలి ఉంటాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..