ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్.. ఎందుకో తెలుసా?
గతంలో జపాన్ పాస్‌పోర్ట్‌కు వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్టపోర్ట్‌గా పేరుండేది
ఇప్పుడు ఆస్థానాన్ని సింగపూర్ భర్తీ చేసింది
ఒక్క సింగపూర్ పాస్ పోర్టుతో ఏకంగా 192 ప్రపంచ దేశాలను చుట్టివచ్చేయొచ్చు
అంటే ఆయా దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే కేవలం సింగపూర్ పాస్ పోర్టుతోనే వెళ్లొచ్చన్నమాట
సంపదకు నెలవైన సింగపూర్ ఈ ఏడాది పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది
లండన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ప్రచురించిన ర్యాంకింగ్ ప్రకారం జపాన్ మూడో స్థానానికి పడిపోయింది
గత ఐదేళ్లపాటు అగ్రస్థానంలో ఉన్న జపాన్ మూడో స్థానానికి పరిమితమైంది
దాదాపు పదేళ్ల క్రితం ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 8వ, యూకే 4వ స్థానాల్లో ఉన్నాయి
ఇక్కడ క్లిక్ చేయండి