మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లు తెలిపిన తర్వాత నటి సమంత చాలా డల్‌గా కనిపంచింది. అయితే తాజాగా సామ్ యాక్టివ్ అయ్యారు.
ఖుషీ మూవీ ప్రమోషన్స్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తోంది. హాలీడే ఎంజాయ్ చేస్తున్న సామ్ ఇన్‌స్టాలో హల్చల్ చేస్తోంది.
గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సామ్.. తాజాగా మళ్లీ యాక్టివ్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వీటిలో ఒకటి సామ్ శారీ పిక్ ఒకటి. బ్లాక్ శారీలో అమెరికాలో దిగిన ఫొటోలు నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందులో సామ్ మరింత అందంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చీరకు సంబంధించిన ఓ వార్త తెగ సందడి చేస్తోంది. ఈ చీర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించారని సమాచారం. అందువల్లే ఈ చీర ధర ఎక్కువని తెలుస్తోంది.
ఇంతకీ ఈ చీర ధర ఎంతో చెప్పలేదు కదూ.! అక్షరాల రూ. 1,38,000. దీంతో ఈ విషయం తెలిసిన వాళ్లు నోరెళ్లబెడుతున్నారు.
ఇదిలా ఉంటే సామ్ నటించిన తాజా చిత్రం ఖుషీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.