21 ఏళ్లుగా టీమిండియాకు కెన్సింగ్టన్ ఓవల్‌ శాపం.. ఈసారైనా తొలగిపోయేనా?

వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది.

ఆ తర్వాత రెండో వన్డే కూడా బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జులై 29న జరగనుంది.

కెన్సింగ్టన్ ఓవల్ భారత జట్టుకు శాపంగా మారింది. ఇక్కడ పేలవమైన రికార్డ్ ఉంది.

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ 14 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.

ఇందులో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది.

11 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడగా, 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో భారత్‌ 21 ఏళ్ల క్రితం ఏకైక విజయం సాధించింది.

2002 వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆ విజయాన్ని నమోదు చేసింది.

వెస్టిండీస్‌తో జరిగిన చివరి 6 వన్డేల సిరీస్‌లో భారత్ విజయం సాధించింది.

కానీ, కెన్సింగ్టన్ ఓవల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ నుంచి భారత్ తన ప్రపంచ కప్ సన్నాహాలను ప్రారంభిస్తోంది.

ఇందుకోసం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ శాపాన్ని ముగించడం చాలా ముఖ్యం.

అంటే విజయం కోసం 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించాల్సి ఉంది.