ఐటీ రీఫండ్‌ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

ఐటీ రీఫండ్‌ కోసం ఫారమ్‌ 26ఏఎస్‌ను ఎంచుకోవాలి

దానికి ముందు మీరు యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (AIS)ను ఒకసారి తనిఖీ చేసుకోవాలి

ఇందులో మీ ఆదాయ వివరాలతో పాటు చెల్లించిన టీడీఎస్‌, టీసీఎస్‌ లాంటి వివరాలు కనిపిస్తాయి

 కొన్ని సార్లు మీ ట్యాక్స్‌ చెల్లింపులు ఆదాయపు పన్ను శాఖకు జమకాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఫారం 26 ఏఎస్‌లో అది కనిపించదు

ఆదాయపు పన్ను రిటర్న్‌లను గడువుకు ముందే దాఖలు చేయాలి. జూలై 31 దాటితో అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

త్వరగా దాఖలు చేస్తే ప్రాసెసింగ్‌ వేగవంతమై రిఫండ్‌ త్వరగా వచ్చే అవకాశం

అన్ని సెక్షన్ల కింద మినహాయింపులు క్లైయిమ్‌ చేసుకోలేకపోయిన వారు కొత్త పన్ను విధానం ఎంచుకోవచ్చు

ఫారం-16లో లేని మినహాయింపులను మీరు క్లైయిమ్‌ చేసుకోవాలంటే దానికి తగిన ఆధారాలు తప్పనిసరి ఉండాలి