American Airlines: 6 నిమిషాల్లో 18 వేల అడుగుల కిందకు దిగిన విమానం.. వీడియో.
గాల్లో ఎగురుతున్న ఓ విమానం ఒక్కసారిగా 18 వేల అడుగుల కిందకు దిగిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. ఇటీవల అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఉత్తర కరోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌విల్‌కు బయల్దేరింది. 29వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానంలో ఒక్కసారిగా ప్రెషర్ పెరగడంతో..
గాల్లో ఎగురుతున్న ఓ విమానం ఒక్కసారిగా 18 వేల అడుగుల కిందకు దిగిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. ఇటీవల అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఉత్తర కరోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌విల్‌కు బయల్దేరింది. 29వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానంలో ఒక్కసారిగా ప్రెషర్ పెరగడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య తలెత్తింది. ప్రయాణికుల ఇబ్బంది గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే వారికి ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ఈ క్రమంలోనే విమానాన్ని వీలైనంత త్వరగా కిందకు దించి, తక్కువ ఎత్తులో నడపాలని నిర్ణయించిన పైలట్లు ఎంతో చాకచక్యంగా కేలం 6 నిమిషాల్లో 18,600 అడుగుల కిందకు దించి ప్రయాణికులను కాపాడారు. ఈ విషయాన్ని ఫ్లైట్‌అవేర్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హారిసన్ హోవ్ తన అనుభవాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తాను చాలాసార్లు విమానంలో ప్రయాణించానని, కానీ ఇది చాలా భయంకరమైన అనుభవమని అందులో పేర్కొన్నారు. విమానంలో పీడనానికి సంబంధించిన సమస్య తలెత్తినందునే కిందకు దించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...