Compensation: శృంగార సైట్లలో వేధింపులు.. బాధితురాలికి రూ. 9,986 కోట్ల నష్టపరిహారం.
అయిదేళ్లు కలిసి జీవించిన మహిళను వ్యక్తిగత ‘శృంగార’ చిత్రాలతో వేధించాలని చూసిన మాజీ భాగస్వామికి అమెరికాలోని ప్రత్యేక న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. తనతో విడిపోయిన తర్వాత ఆమె ప్రైవేటు ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం మొదలుపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన న్యాయం జరగలేదని భావించిన ఆమె.. సివిల్ కోర్టును ఆశ్రయించింది.
అయిదేళ్లు కలిసి జీవించిన మహిళను వ్యక్తిగత ‘శృంగార’ చిత్రాలతో వేధించాలని చూసిన మాజీ భాగస్వామికి అమెరికాలోని ప్రత్యేక న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. తనతో విడిపోయిన తర్వాత ఆమె ప్రైవేటు ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం మొదలుపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన న్యాయం జరగలేదని భావించిన ఆమె.. సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సివిల్ దావాపై విచారణ పూర్తిచేసిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం.. బాధితురాలికి 1.2 బిలియన్ డాలర్లు అంటే 9,986 కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ భాగస్వామిని ఆదేశించింది. అమెరికాకు చెందిన ఓ మహిళ మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత 2021 అక్టోబరులో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. అక్కడి నుంచీ అతడి వేధింపులు మొదలయ్యాయి. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకొన్న ఫొటోలను శృంగార వెబ్‌సైట్లలో పెట్టాడు. ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ-మెయిల్ నుంచి సేకరించిన వ్యక్తిగత ఫొటోలను తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలో పోస్టు చేశాడు. ఆ ఫొటోల లింకులను బాధితురాలి స్నేహితులు, కుటుంబసభ్యులకూ పంపాడు. ‘వాటిని ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు నీ జీవితం సరిపోదు’ అంటూ ఆమెకు సందేశాలు పంపించేవాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన ఆ మహిళ 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్లు అంటే 1,664 కోట్ల రూపాయలు, ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు అనగా 8,322 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...