Dog – Black snake: వాహ్‌ శునకం.. నల్ల తాచు నుంచి యజమానిని కాపాడింది.. వీడియో.

| Edited By: Phani CH

Mar 24, 2023 | 8:53 AM

శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. అలాంటి ఓ విష‌పూరిత స‌ర్పం నుంచి త‌న య‌జ‌మానిని కాపాడింది. మంచం కింద న‌క్కి ఉన్న పామును చూసి కుక్క ప‌దే ప‌దే మొర‌గ‌డంతో య‌జ‌మాని అప్ర‌మ‌త్త‌మై

శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. అలాంటి ఓ విష‌పూరిత స‌ర్పం నుంచి త‌న య‌జ‌మానిని కాపాడింది. మంచం కింద న‌క్కి ఉన్న పామును చూసి కుక్క ప‌దే ప‌దే మొర‌గ‌డంతో య‌జ‌మాని అప్ర‌మ‌త్త‌మై త‌న ప్రాణాల‌ను కాపాడుకున్నాడు.ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్య‌క్తి ఓ కుక్క‌ను పెంచుకుంటున్నాడు. ఆ శున‌కానికి య‌జ‌మాని అంటే ఎంతో ప్రేమ‌. య‌జ‌మానికి ఏమైనా జ‌రిగితే త‌ట్టుకోలేదు. అయితే మూడు రోజుల క్రితం విష‌పూరిత‌మైన బ్లాక్‌ మాంబా స‌ర్పం య‌జ‌మాని ఇంట్లోకి ప్ర‌వేశించి, మంచం కింద న‌క్కింది. ఈ పామును కుక్క గ‌మ‌నించి, ప‌దే ప‌దే మొరిగింది. య‌జ‌మాని మంచం మీద నుంచి కాలు పెడుతుంటే కూడా కుక్క కింద పెట్ట‌నివ్వ‌లేదు. రెండు రోజుల పాటు అదే తంతు కొన‌సాగింది. మూడో రోజు కూడా కుక్క మొర‌గ‌డం, కాళ్ల‌ను కింద పెట్ట‌నివ్వ‌క‌పోవ‌డంతో య‌జ‌మానికి అనుమానం వ‌చ్చింది. దీంతో మంచం కింది భాగాన్ని ప‌రిశీలించ‌గా పాము క‌నిపించింది.అప్ర‌మ‌త్త‌మైన య‌జ‌మాని పాముల‌ను పట్టే వ్య‌క్తికి స‌మాచారం అందించాడు. స్నేక్ క్యాచ‌ర్ ఆ ఇంటికి చేరుకుని పామును ప‌ట్టేశాడు. అనంత‌రం దాన్ని స‌మీప అడ‌వుల్లో వ‌దిలేశాడు. అయితే ద‌క్షిణాఫ్రికాలో క‌నిపించే అత్యంత విష‌పూరిత పాముల్లో ఇది ఒక‌టి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 24, 2023 08:03 AM