James Cameron: అమ్మకానికి టైటానిక్ కథ పుట్టిన చోటు.. ధర ఎంతంటే.? వీడియో..

|

Jul 15, 2023 | 8:28 PM

దర్శకుడు జేమ్స్ కామెరాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటానిక్, అవతార్ వంటి విజువల్ వండర్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. అలాంటి మంచి కథలను ఆయన తనకు ఇష్టమైన ఎస్టేట్‌లో కూర్చొని సముద్రాన్ని చూసి రాస్తారట. ఇప్పుడు ఆ ఎస్టేట్‌ను జేమ్స్ కామెరూన్ దంపతులు అమ్మేస్తున్నారు.

దర్శకుడు జేమ్స్ కామెరాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటానిక్, అవతార్ వంటి విజువల్ వండర్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. అలాంటి మంచి కథలను ఆయన తనకు ఇష్టమైన ఎస్టేట్‌లో కూర్చొని సముద్రాన్ని చూసి రాస్తారట. ఇప్పుడు ఆ ఎస్టేట్‌ను జేమ్స్ కామెరూన్ దంపతులు అమ్మేస్తున్నారు. సుమారు 102 ఎకరాలు ఉండే ఎస్టేట్ విక్రయించాలని నిర్ణయించారు. ధాని ధరను కూడా ప్రకటించారు. 33 మిలియన్ డాలర్లు అంటే ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం.. రూ.272 కోట్లకు కామెరూన్ ఎస్టేట్‌ను విక్రయానికి పెట్టారు. ఇన్ని కోట్లు పలికే ఎస్టేట్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి..కాలిఫోర్నియాలోని హోలిస్టర్ రాంచ్ కమ్యూనిటీ ఆఫ్ గావియోటాలో 102 ఎకరాల్లో ఈ ఎస్టేట్ ఉంది. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఎస్టేట్‌లో 8,000 చదరపు అడుగుల్లో ఐదు బెడ్‌రూమ్‌లున్నాయి. 2 వేల చదరపు అడుగుల్లో ఒక గెస్ట్ హౌస్‌, 24,000 చదరపు అడుగుల పెద్ద గ్యారేజ్‌లో హెలికాప్టర్ పార్క్‌ చేసే సౌకర్యం ఉంది. అలానే పచ్చటి లాన్‌లు, ఒక పెద్ద కొలను కూడా ఉంది. ఇంకా ఎస్టేట్‌లో జిమ్, సినిమా థియేటర్, గేమ్ రూమ్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఎస్టేట్‌ “హవాయి ద్వీపం రిసార్ట్ ” లో ఉన్న అనుభూతిని కలిగిస్తుందని కామెరాన్ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...